హుస్నాబాద్​లో స్ట్రీట్​లైట్ల కోసం రూ.15 లక్షలు

హుస్నాబాద్​లో స్ట్రీట్​లైట్ల కోసం రూ.15 లక్షలు
  • శ్మశానవాటిక బ్యూటిఫికేషన్​కు మరో రూ.15 లక్షలు
  • హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కరెంటు స్తంభాలు, స్ట్రీట్​లైట్ల ఏర్పాటుతోపాటు శ్మశానవాటిక బ్యూటిఫికేషన్, శానిటేషన్​ వెహికల్స్​కు ఇన్సూరెన్స్​చేయించేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పలు వార్డుల్లో రూ.15 లక్షలతో కరెంటుస్తంభాలు, స్ట్రీట్​లైట్లను ఏర్పాటు చేసేందుకు సభ్యులు సమ్మతి తెలిపారు. చైర్ పర్సన్ ఆకుల రజిత అధ్యక్షతన గురువారం కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, 2024–-25లో చేపట్టబోయే పలు అంశాలపై చర్చించారు. మార్కెట్​దగ్గర ఉన్న శ్మశానవాటికలో 

రూ.15లక్షలతో బ్యూటిఫికేషన్​పనులు చేయాలని తీర్మానం చేశారు.  మరో రూ.15 లక్షలతో శానిటేషన్​ వెహికిల్స్​కు ఇన్సూరెన్స్​చేయాలని నిర్ణయించారు. రూ.4 లక్షలతో పారిశుధ్య కార్మికులకు బట్టలు, సబ్బులు, నూనె, బూట్లు తదితర వస్తువులు కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. 20 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ఉపయోగిస్తున్న ఆటోలు, ట్రాక్టర్లు, డోజర్, వైకుంటరథాన్ని రిపేర్​తోపాటు ఆయిల్ చేంజ్ చేసేందుకు రూ.2లక్షలు కేటాయిస్తూ ఆమోదం తెలిపారు. 

పారిశుధ్య వాహనాల జీపీఆర్​ఎస్​ సిస్టానికి రూ.90వేలు కేటాయించారు. వీటితోపాటు 25 అంశాలపై సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్​ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, కమిషనర్​ మల్లికార్జున్​, కౌన్సిలర్లు, కో- ఆప్షన్ మెంబెర్లు, అధికారులు పాల్గొన్నారు.