జ్యోతినగర్, వెలుగు : తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రూ. 15 లక్షలపైగా దోచుకెళ్లారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గౌతమినగర్‌కు చెందిన ఇనుగంటి రామ్మోహన్‌రావు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యాడు.
అతడి భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ట్రీట్‌మెంట్ కోసం మూడు రోజుల కింద హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. శుక్రవారం తిరిగి వచ్చే సరికి తాళం పగులగొట్టి ఉంది. అనుమానంతో ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో ఉండాల్సిన రూ. 15.20 లక్షలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.