15 నాన్‌‌ డ్యూటీ పెయిడ్‌‌ లిక్కర్‌‌ బాటిళ్లు సీజ్

15 నాన్‌‌ డ్యూటీ పెయిడ్‌‌ లిక్కర్‌‌ బాటిళ్లు సీజ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ​గ్రేటర్​పరిధిలోని రెండు చోట్ల 15 నాన్ ​డ్యూటీ పెయిడ్‌‌ లిక్కర్‌‌ బాటిళ్లు చిక్కాయి. చేవెళ్ల ​పరిధిలోని ఫామ్​హౌజ్‌‌లో పర్మిషన్ ​లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి పార్టీ నిర్వహిస్తున్నట్లు ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులకు  సమాచారం అందింది. ఏసీ రంగారెడ్డి టీమ్‌‌ రైడ్ ​చేసి 7 లిక్కర్ ​బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.

ఫామ్​హౌజ్​యజమానిని చేవేళ్ల పోలీసులకు అప్పగించినట్లు అసిస్టెంట్​కమిషనర్‌‌ ఆర్‌‌.కిషన్‌‌  తెలిపారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఘట్​కేసర్​లో విక్రయిస్తున్న 8 లిక్కర్​బాటిళ్లను ఎన్‌‌ ఫోర్స్ మెంట్‌‌ టీమ్‌‌ పట్టుకుంది. నిందితుడు లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసి ఘట్​కేసర్​ఎక్సైజ్‌‌ పోలీసులకు అప్పగించింది.