కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథగూడెంలో బుధవారం కలుషిత నీరు తాగి15 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బోరు పంపు నుంచి నీరు తాగిన వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే చెన్నూరులోని ప్రభుత్వాసుపత్రి డాక్టర్ తబుస్సుం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
అస్వస్థతకు గురైన వ్యక్తులకు చికిత్స చేశారు. మరో రెండు రోజులపాటు రఘునాథగూడెంలోనే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. కలుషిత నీరు తాగటంతోనే వాంతులు విరేచనాలు అయ్యాయని ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.