శాయంపేట, వెలుగు : పిచ్చికుక్క దాడిలో హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం వారంతపు సంతలో ఒకరిపై దాడి చేసిన కుక్క, రోడ్డుపై వెళ్తున్న వృద్ధులు, కొందరు యువకులను కరిచింది.
ఇది గమనించిన స్థానికులు కుక్కను కొట్టి చంపారు. గాయపడ్డ వారికి స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందజేసి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.