‘గాంధీ’హాస్పటల్‎లో మధ్యలో ఆగిపోయిన లిఫ్ట్

‘గాంధీ’హాస్పటల్‎లో మధ్యలో ఆగిపోయిన లిఫ్ట్
  • అరగంట పాటు 15 మంది నరకయాతన

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆసుపత్రిలోని లిఫ్ట్​మధ్యలో ఆగిపోవడంతో 15 మంది అరగంటపాటు నరకయాతన అనుభవించారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు మెయిన్​బిల్డింగ్​లోని ఆరో ఫ్లోర్ కు వెళ్లేందుకు గ్రౌండ్​ఫ్లోర్​లో 15 మంది నాలుగో నంబర్​లిఫ్ట్​ఎక్కారు. వీరిలో14 మంది అటెండెంట్లు, ఒక పేషెంట్​ఉన్నారు. కాగా ఐదు, ఆరు ఫ్లోర్ల మధ్య లిఫ్ట్​స్ట్రక్​అయింది. దీంతో లోపలున్న 15 మంది తీవ్ర ఆందోళన చెందారు. 

పలుమార్లు అలారమ్​బటన్​నొక్కడంతో సెక్యూరిటీ గార్డులు గమనించి టెక్నీషియన్​ను పిలిపించారు. అరగంట తర్వాత లిఫ్ట్​ ఆరో ఫ్లోర్​కు చేరుకుని డోర్లు తెరుచుకున్నాయి. 15 మంది ‘దేవుడా.. బతికిపోయాం..’ అంటూ బయటపడ్డారు. లిఫ్ట్ ఆపరేటర్లను నియమించాలని, ఎప్పటికప్పుడు సర్వీసింగ్​చేయించాలని పేషెంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు.