
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ నిధుల సమస్య లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రుణమాఫీలో దళితులు లేరని.. ఈసారి బడ్జెట్ లో 14 నుంచి 15 శాతం నిధులు కేటాయించాలని సూచించారు. రెడ్ హిల్స్ లోని ఎఫ్ఎసీసీఐ లో ఎంఎస్ఎమ్ పాలసీ2024పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడా రు.
'గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ని తీసుకు రావడంలో శ్రీధర్ బాబు కీ రోల్ పోషించారు. దళిత ఎంటర్ప్రెన్యూర్స్ సమస్యలు గుర్తించి వారికి సపోర్ట్ చేయాలి. దళితులకు స్కిల్స్ నేర్పించాల్సిన అవసరముంది. బిజినెస్ ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందు కు నేను కూడా గతంలో ట్రైనింగ్ తీసుకున్నాను.
ప్రొక్యూర్మెంట్ పాలసీపై ప్రతి రెండు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఎంటర్ప్రెన్యూర్స్ కు కర్ణాటక మాదిరిగా తెలంగాణలోనూ స్కీమ్స్ అందించాలి' అని ఎమ్మెల్యే వివేక్ సూచించారు.