
లింగాల, వెలుగు: లింగాల మండల పరిధిలోని మానాజీపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు మాడెం స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం గొర్రెల మందను గ్రామ సమీపంలోని తన పొలంలో ఉంచాడు. అర్ధరాత్రి మందపై కుక్కలు దాడి చేశాయి. స్వామి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే 15 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ. 2 లక్షల దాకా ఉంటుందని బాధితుడు వాపోయారు.