పాలమాకుల గురుకులంలో  విద్యార్థులకు అస్వస్థత

పాలమాకుల గురుకులంలో  విద్యార్థులకు అస్వస్థత

శంషాబాద్, వెలుగు: జ్యోతిబాపూలే గురుకులంలో 15 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని జ్యోతిబాపూలే గురుకులంలో సుమారు 1,200 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. గురువారం కొంతమంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మందికి అధికారులు పరీక్షలు చేయించారు. విషయం తెలిసి కొందరు పేరెంట్స్​పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆదివారం మరో 15 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ఒక చిన్నారికి డెంగీ వైరల్ ఫీవర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

స్కూల్​పరిసర ప్రాంతాల్లో శుభ్రత పాటించకపోవడం, విద్యార్థులకు సరైన ఆహారం ఇవ్వకపోవడంతో అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైరల్ ఫీవర్ కారణంగానే స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారని, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు.