హైదరాబాద్కు వస్తున్న రైలులో భారీ చోరీ..దంపతుల నుంచి 15 తులాల నగలు ఎత్తుకెళ్లారు

హైదరాబాద్కు వస్తున్న రైలులో భారీ చోరీ..దంపతుల నుంచి 15 తులాల నగలు ఎత్తుకెళ్లారు

నడుస్తున్న  రైలులో భారీ చోరీ జరిగింది. ఏప్రిల్ 6న  మహారాష్ట్ర నుంచి   హైదరాబాద్ కు వస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలులో ఓ జంట నుంచి 15 తులాల బంగారంతో పాటు నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. బంగారంతో పాటు, దొంగలు రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత  ఆ దంపతులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితులు మహేందర్ ,కవిత దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్ర నుంచి రైలు ఎక్కారు.  రైలు మహారాష్ట్రలోని బిద్రికి చేరుకున్న తర్వాత  తమ హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా బంగారం,నగదు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన  దంపతులు సికింద్రాబాద్  రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో   కేసు నమోదు చేసి  మహారాష్ట్ర రైల్వే పోలీసులకు బదిలీ చేశారు.కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు.

►ALSO READ | Black Monday: 40 ఏళ్ల తర్వాత స్టాక్ మార్కెట్లో సేమ్ సీన్ రిపీట్.. ఈ 20 లక్షల కోట్ల రికవరీ ఎప్పటికయ్యేనో..?