మెహిదీపట్నం, వెలుగు: సంక్రాంతి పండుగకు ఊరెళ్తే దొంగలు ఇంట్లో పడి దోచుకుపోయారు. లంగర్ హౌస్ బాపు ఘాట్ గాంధీనగర్‌కు చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లి మండలం కమేటకు వెళ్లాడు.
దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.