Rohit Sharma: మీరు ఎప్పటికీ రిటైర్ అవ్వొద్దు.. రోహిత్‌కు 15 ఏళ్ళ అభిమాని ఎమోషనల్ లెటర్

Rohit Sharma: మీరు ఎప్పటికీ రిటైర్ అవ్వొద్దు.. రోహిత్‌కు 15 ఏళ్ళ అభిమాని ఎమోషనల్ లెటర్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం పేలవ ఫామ్ లో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు దేశవాళీ క్రికెట్ లోనూ హిట్ మ్యాన్ చెత్త ఫామ్ కొనసాగుతుంది. ఫామ్ కోసం రంజీ ట్రోఫీ బాట పడితే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్ లో 28 పరుగులతో సరిపెట్టుకున్నాడు. 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతని అదృష్టం మారలేదు. ముంబై,  భారత జట్టుకు కెప్టెన్ గా ఇలాంటి ప్రదర్శన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

15 ఏళ్ళ అభిమాని ఎమోషనల్ అవుతూ రోహిత్ కు రాసిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. " క్రికెట్ లాంటి అద్భుతమైన క్రీడ చూడడానికి నా అభిమాన ఆటగాడు రోహిత్ కారణం. ఈ యుగంలో నేను పుట్టడం.. నీ క్లాస్ బ్యాటింగ్ ను చూడడం నా అదృష్టం. మీరు నా ఆరాధ్య దైవం. ఫామ్ తాత్కాలికం. క్లాస్ శాశ్వతం. మీరు ఈ మధ్య కాలంలో బిగ్ ఇన్నింగ్స్ ఆడకపోయినా పర్వాలేదు. మీరు త్వరలోనే ఫామ్ లోకి వస్తారని ఆశిస్తున్నా. నిన్న మీరు కొట్టిన మూడు సిక్సర్లు అద్భుతం. నేను మ్యాథ్స్ క్లాస్ లో కూర్చొని మీ బ్యాటింగ్ చూసాను. 

ALSO READ | ‘ఐసీసీ టెస్ట్ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024’.. అట్లుంటది బుమ్రాతోని..!

ద్వేషించే వారు ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటారు. కానీ మీ నాయకత్వ లక్షణాలు అద్భుతం. కెప్టెన్ గా ప్లేయర్ గా రెండు విభాగాల్లో మీరు విజయం సాధించారు. మీ కోసం నేను ప్రతి మ్యాచ్ చూస్తా. దయచేసి ఎప్పటికీ రిటైర్ కావద్దు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో మీరు  ప్రత్యర్థి జట్లను చీల్చివేస్తారని భావిస్తున్నాను. స్పోర్ట్స్ అనలిస్ట్ కావాలనేది నా కల. నేను రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసాను. త్వరలో మీరు ఫామ్ లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నాను". అని ఛబ్రియా అనే అభిమాని లెటర్ ను ముగించాడు.