15 ఏండ్ల పోరాటానికి దక్కిన పోడు పట్టాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసుల విజయం

15 ఏండ్ల పోరాటానికి దక్కిన పోడు పట్టాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసుల విజయం

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల ఏరియాలోని ఆదివాసీలు తమ పోడు భూముల హక్కుల కోసం15 ఏండ్లుగా పోరాడుతూ చివరకు పట్టాలు పొందారు. బుధవారం భద్రాచలం ఐటీడీఏ పీవో 400 మందికి పట్టాలను పంపిణీ చేశారు. 

ఏండ్లుగా  సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తుండగా.. కొందరు భూస్వాములు కోర్టులకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకొని ఇబ్బందులు కల్పించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎట్టకేలకు హైకోర్టు ఆర్డర్ పొందిన ఆదివాసీలు తమ పోడు భూములపై హక్కులు సాధించుకున్నారు. పట్టాలు పొందిన సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు.