తుంగతుర్తిలో రూ.150 కోట్లతో  అభివృద్ధి పనులు 

  •    ఎమ్మెల్యే మందుల సామెల్​ 

తుంగతుర్తి వెలుగు : తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే  మందుల సామెల్ అన్నారు.  శుక్రవారం   మండల కేంద్రంలోని  ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.     కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నియోజకవర్గంలో  రూ. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.  

ఈనెల 14న తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగే కాంగ్రెస్  ముఖ్య కార్యకర్తల సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  3

ఈ సమావేశంలో  కాంగ్రెస్ జి ల్లా అధ్యక్షుడు  చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్  నాయకులు రాజేందర్ రెడ్డి, పాలకుర్తి రాజయ్య, సంకినేని గోవర్ధన్ రావు, ఉప్పుల రాంబాబు, గంగరాజు కొండరాజు 
పాల్గొన్నారు.