![గ్రేటర్లో పనులకు మరో రూ.150 కోట్లు](https://static.v6velugu.com/uploads/2025/02/150-crores-released-for-ghmc-works_BDvfI2CXpM.jpg)
- సీసీ రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు,ఇతర పనులకు కేటాయింపు
- కార్పొరేటర్ల హర్షం
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్లో సీసీ రోడ్లు, పార్కులు, డ్రైనేజీ, స్పోర్ట్స్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల పనులు చేసేందుకు బల్దియా రూ.150 కోట్లు కేటాయించింది. ఈ పనుల కోసం ప్రపోజల్స్పంపాలని జోనల్ కమిషనర్లను కమిషనర్ఆదేశించారు. ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోవడంతో వారికి ముఖం చూపించలేకపోతున్నామని కార్పొరేటర్లు పలుమార్లు మేయర్, కమిషనర్‌కు వేడుకున్నారు.
ఇటీవల స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లోనూ ఒక్కో డివిజన్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా పైసా విడుదల చేయకపోవడం, ఇప్పుడు కమిషనర్ నిధుల విడుదల ప్రకటన చేయడంతో కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు.