Kerala: టెంపుల్లో బాణసంచా పేలుడు..150 మందికి గాయాలు

Kerala:  టెంపుల్లో బాణసంచా పేలుడు..150 మందికి గాయాలు

కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలో  విషాదం జరిగింది. ఫెస్టివల్ సందర్భంగా ఓ టెంపుల్లో  బాణసంచా నిల్వలో భారీపేలుడు జరిగింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.  

పోలీసుల వివరాల ప్రకారం..అక్టోబర్ 28న రాత్రి  అంజోతంబలం వీరేకావు దగ్గర తెయ్యం ఉత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా ఈ సంఘటన జరిగింది. జనం భారీగా గుమిగూడిన సమయంలో టెంపల్ లోని ఓ షాపులో  నిల్వ ఉంచిన బాణంచాలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. తర్వాత ఒకదాని తర్వాత మరొకటి పేలిపోయాయి. దీంతో అక్కడున్న భక్తులంతా భయాందోళనతో పరుగులు తీశారు.  150 మందికి పైగా మంట్లో చిక్కుకున్నారు. గాయాలైన వాళ్లను వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు అధికారులు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.