ఏపీలో రేపటి నుంచి 1500 బస్సులు ప్రారంభం

ఏపీలో రేపటి నుంచి 1500 బస్సులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో రేపటి(గురువారం) నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిలిచ్చింది. మొత్తంగా రేపు 1500 బస్సులు నడవనున్నాయి. ఇక ఏసీ, సిటీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.

బస్సులు నడిపించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం… అన్ని డిపోల్లో బస్సులను క్లీన్ చేయిస్తున్నారు  ఆర్టీసీ అధికారులు.  రోజు 12 గంటల పాటు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడవనున్నట్లు తెలిపారు.రేపు ఉదయం 7 గంటలకు డిపోలనుంచి బయల్దేరుతాయని చెప్పారు. తిరిగి రాత్రి ఏడు గంటలకు డిపోలకు చేరుకుంటాయన్నారు. ఆన్ లైన్ రిజర్వేషన్లు ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.డిపోల్లో బస్సు ఎక్కే ముందే టికెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. బస్సుల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఆర్టీసీ అధికారులు. సానిటైజర్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామన్న అధికారులు…ప్రయాణికులు మాస్క్ లు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.

లాక్ డౌన్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో…ఆర్టీసీకి  1200 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లపైన వృద్ధులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయవద్దని సూచించారు.