
న్యూఢిల్లీ: ఇ–కోర్టుల ప్రాజెక్టు థర్డ్ఫేజ్కోసం కేంద్రం రూ.1,500కోట్లు కేటాయించింది. గతేడాది సెప్టెంబర్లో రూ.7,210 కోట్ల అంచనాతో మూడో దశను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. అన్ని కోర్టుల రికార్డులను, పెండింగ్కేసుల వివరాలను డిజిటలైజ్చేయడానికి ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. నేషనల్ఇ–గవర్నెన్స్ప్లాన్లో భాగంగా 2007 నుంచి ఇ–కోర్టుల ప్రాజెక్టు అమలులో ఉంది. గతేడాది రెండో దశ ముగిసింది. మూడో దశ పూర్తయితే వర్చువల్కోర్టుల పరిధిని పెంచేందుకు అవకాశం లభిస్తుంది.