లిక్కర్ తాగినోడికే కాదు..దాని నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి కూడా కిక్ ఇస్తుందనడంలో అతిశయోక్తి కాదు. అందుకే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వాలు విచ్చిలవిడిగా లిక్కర్ షాపులకు అనుమతిస్తాయి. అయితే గోవాలో గత మూడేళ్లలో 1,500 మద్యం షాపులకు అనుమతివ్వడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏప్రిల్ 2020 నుంచి గోవాలో 1,500 మద్యం లైసెన్స్‌లు జారీ చేయబడ్డాయి. అంటే సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ. వీటిలో ఎక్కువ భాగం బార్డెజ్ (393)లో జారీ చేయబడ్డాయి. తర్వాత సాల్సెట్ (367) , మోర్ముగో (137) ఉన్నాయి. గోవాలో మొత్తం 10 వేల 500 మద్యం షాపులున్నాయి. ఏప్రిల్ 2020 నుండి జారీ చేసిన మద్యం లైసెన్సుల వివరాలను చెప్పాలని మార్గోవ్ ఎమ్మెల్యే దిగంబర్ కామత్ శాసనసభలో అడిగిన ప్రశ్నకు సీఎం ప్రమోద్ సావంత్ ఈ లెక్కలను వెల్లడించారు.