15.35 కోట్ల లిక్కర్ ​తాగేసిన్రు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు రోజుల్లో రూ.15.35 కోట్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో జిల్లాలోని 82 వైన్​షాపుల్లో మూడు రోజుల్లో ఇంత మొత్తం లిక్కర్​సేల్​అయింది. భువనగిరి పరిధిలో రూ.5.55 కోట్లు, రామన్నపేట పరిధిలో రూ.3.57కోట్లు, ఆలేరు పరిధిలో రూ.3.66 కోట్లు, మోత్కూరు పరిధిలో రూ.2.57 కోట్ల లిక్కర్​సేల్​అయింది.