భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం అక్రమంగా రవాణా చేస్తున్న 156 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.18 కాటన్లలో 180 మిల్లిలీటర్ల మద్యం సీసాలను కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మద్యంతో పాటు, కారును సీజ్చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తరలిస్తున్న గంగుల భూమయ్యతో పాటు సిద్ధిరామేశ్వర వైన్స్ ఓనర్పై కేసు నమోదు చేశామన్నారు.