
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,563 కేసులను పరిష్కరించి, బాధితులకు రూ.2,12,67,784 చెల్లించారు. శనివారం మెదక్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా జడ్జి లక్ష్మీశారద ఆధ్వర్యంలో లోక్ అదాలత్నిర్వహించారు.
ఈ సందర్భంగా యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం, ఇన్సూరెన్స్ అమౌంట్ చెల్లించారు. అలాగే పీఎల్సీ బ్యాంకు రికవరీ, భార్యాభర్తల కేసులు, క్రిమినల్, సివిల్ కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో కక్షిదారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్అధికారులు పాల్గొన్నారు.