మస్తుగా తాగేసిన్రు..

మస్తుగా తాగేసిన్రు..
  •     నెల రోజుల్లో రూ.158.84 కోట్ల లిక్కర్​ సేల్

నాగర్ కర్నూల్, వెలుగు: ఓ వైపు ఎలక్షన్ల ప్రచారం.. మరోవైపు పెండ్లిండ్ల దావత్​లతో నాగర్​ కర్నూల్​ జిల్లాలో ఒక్క నెలలోనే రూ.158.84 కోట్ల లిక్కర్​ సేల్​ అయ్యింది. మే నెల మొదటి వారంలోనే రూ.36 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఈ లెక్కలు చూస్తుంటే బండ్లకు డీజిల్,​ జనానికి మందు లేకుంటే ఎలక్షన్లు నడిచే పరిస్థితి లేదని అంటున్నారు. అలాగే ఏప్రిల్​ నెల మొత్తం మంచి ముహూర్తాలు ఉండడంతో పెండ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతరత్రా ఫంక్షన్లకు రెస్ట్​ లేకుండా పోయింది. దావత్​లకు గ్యాప్​ లేకపోవడంతోనే భారీగా లిక్కర్​ సేల్స్​ జరిగాయిన అంటున్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లాలో 67 వైన్​ షాపులు,6 బార్లు ఉన్నాయి.  

ఏప్రిల్​ నెలలో రికార్డ్​ సేల్స్..​ 

ఏప్రిల్​ నెలలో ఎండలు దంచికొట్టినా బీర్ల షార్టేజ్​తో లిక్కర్​ సేల్స్​ బాగా పెరిగాయి.ఏప్రిల్​లో 1,57,684 కార్టన్ల బీర్లు అమ్ముడుపోతే, 2,62,345 కార్టన్ల లిక్కర్​ సేల్​ అయ్యింది. మే మొదటి వారంలో 38,239 కార్టన్ల బీర్లు, 44,878 కార్టన్ల లిక్కర్​ అమ్ముడైంది. అలాగే ఇండియన్​ మేడ్​ ఫారిన్​ లిక్కర్​తో పాటు గ్రామాల్లో గుడుంబా, కల్లు పుష్కలంగా దొరుకుతోంది.