రాష్ట్రంలో కొత్తగా 159 బార్లు.. ఇయ్యాల నోటిఫికేషన్..

కొత్త మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌‌

గ్రేటర్‌ హైదరాబాద్‌‌ పరిధిలోనే 55 బార్లకు పర్మిషన్
ఇయ్యాల నోటిఫికేషన్‌.. దరఖాస్తుల స్వీకరణ కూడా..
4 స్లాబ్‌లు.. లక్ష రూపాయల నాన్‌రిఫండబుల్‌‌ అప్లికేషన్‌ ఫీజు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కొత్త బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో 2011 జనాభా ప్రాతిపదికన 159 బార్లకు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. ఒక్క గ్రేటర్‌‌‌‌ పరిధిలోనే 55 బార్లకు పర్మిషన్‌‌‌‌ ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,631 బార్లు ఉండగా, కొత్త వాటితో కలిపి వీటి సంఖ్య 5,790కి చేరనుంది. కొత్త బార్ల ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. కొత్త బార్లకు సంబంధించి సోమవారం అధికారికంగా నోటిఫికేషన్‌‌‌‌ వెలువడనుంది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న డ్రా తీస్తారు. జీహెచ్‌‌‌‌ఎంసీలో మాత్రం 11న ఎక్సైజ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. డ్రా పొందిన వారికి 17న క్లియరెన్స్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ జారీ చేస్తారు.

50 వేల లోపు జనాభాకు రూ.30 లక్షలు

బార్లకు ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ను జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబ్‌‌‌‌లుగా విభజించారు. 50 వేల లోపు జనాభాకు రూ.30 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ.42 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలు ఉంటే రూ.44 లక్షలు, 20 లక్షల కంటే పైన ఉంటే రూ.40 లక్షలుగా ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ను నిర్ణయించారు. నోటిఫైడ్‌‌‌‌ బార్లకు లీజ్‌‌‌‌ డీడ్‌‌‌‌ లేదా సేల్‌‌‌‌ డీడ్‌‌‌‌, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌‌‌‌, ట్రేడ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ కంపీటెంట్‌‌‌‌ లోకల్‌‌‌‌ అథారిటీ డాక్యుమెంట్స్‌‌‌‌ అవసరం లేదు. ఫామ్‌‌‌‌ 1 అప్లికేషన్‌‌‌‌ను నింపాలి. ప్రతి అప్లికేషన్‌‌‌‌కు లక్ష నాన్‌‌‌‌ రీఫండబుల్‌‌‌‌ చలాన్‌‌‌‌ కట్టాలి. బార్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ వచ్చిన 90 రోజుల్లోపు మొత్తం ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌లోని ఫస్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లించాలి.

ఫీజులు, ట్యాక్స్‌‌‌‌ రూపంలో మస్తు ఆదాయం

కొత్త బార్లతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. గతంలో 2,216 వైన్స్‌‌‌‌కు నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేయగా, 45 వేల అప్లికేషన్లు వచ్చాయి. కొంత మంది వేర్వేరు వ్యక్తుల పేరుతో 30 నుంచి 40 అప్లికేషన్లు వేశారు. ఇలా అప్లికేషన్ల ఫీజుతోనే సర్కారుకు రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం వచ్చింది. తాజాగా 159 బార్లకు అప్లికేషన్ల ఫీజులతోపాటు, ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ రూపంలో 50 కోట్లకుపైగా ఆదాయం రానుంది. లిక్కర్‌‌‌‌ సేల్స్‌‌‌‌ కూడా పెరగనున్నాయి.

ఏ జిల్లాలో ఎన్ని బార్లు..

ఎక్సైజ్‌‌ డివిజన్‌‌            కొత్తవి       మొత్తం

వరంగల్‌‌                     4            120

కరీంనగర్‌‌                    6           180

మహబూబ్‌‌నగర్‌‌           10         270

నిజామాబాద్‌‌               16         624

ఆదిలాబాద్‌‌                 13         486

మెదక్‌‌                       11         366

ఖమ్మం                      4          120

నల్లగొండ                   13         390

రంగారెడ్డి                     8          264

జీహెచ్‌‌ఎంసీ పెరిఫెరీ      19         770

జీహెచ్‌‌ఎంసీ                55      2,200

మొత్తం                     159    5,790

 

ఇవి కూడా చదవండి..

పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు