దేశంలో 30 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు.. 937 మ‌ర‌ణాలు

దేశంలో 30 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు.. 937 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా విల‌యం ఆగ‌డం లేదు. వైర‌స్ బారిన‌ప‌డిన వారి సంఖ్య 30 వేల‌కు చేరువ‌లోకి వెళ్లింది. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 1594 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా మ‌హ‌మ్మారి ఈ ఒక్క రోజులోనే 51 మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. దీంతో మంగ‌ళారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 29,974కు పెరిగిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అందులో 937 మంది మ‌ర‌ణించ‌గా.. 7027 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం 22,010 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది.

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 8590 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఈ రాష్ట్రంలో 369 మంది మ‌ర‌ణించ‌గా.. 1282 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుజ‌రాత్ లో 3548, ఢిల్లీలో 3108 కేసులు న‌మోద‌య్యాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2368, రాజ‌స్థాన్ లో 2262, యూపీలో 2043, త‌మిళ‌నాడులో 1937 మందికి వైర‌స్ సోకింది. ఏపీలో 1259, తెలంగాణ‌లో 1004 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్పటికే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, మ‌ణిపూర్, త్రిపుర‌, గోవా రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన వారంతా పూర్తిగా కోల‌కుని డిశ్చార్జ్ అయ్యారు.