15 ఏండ్ల కింద మూతపడ్డ బడి తెరుచుకుంది

15 ఏండ్ల కింద మూతపడ్డ బడి తెరుచుకుంది

గన్నేరువరం, వెలుగు : కరీంనగర్‌‌‌‌ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లెలోని ప్రైమరీ స్కూల్‌‌‌‌ 15 ఏండ్ల తర్వాత బుధవారం రీఓపెన్‌‌‌‌ అయింది. స్టూడెంట్లు తక్కువగా ఉన్నారన్న కారణంతో స్కూల్‌‌‌‌ను మూసేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకోవడంతో ఈ అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌ నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా 22 మంది స్టూడెంట్లకు బుధవారం ఎంఈవో శ్రీధర్‌‌‌‌రెడ్డి అడ్మిషన్‌‌‌‌ ఇచ్చారు. దీంతో స్టూడెంట్లతో స్కూల్‌‌‌‌ సందడిగా కనిపించింది. గ్రామంలో స్కూల్‌‌‌‌ తిరిగి ప్రారంభం కావడంతో దూరాభారంతో పాటు, ఫీజుల భారం సైతం తప్పుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో పాటు గంగాధర మండలం మధురానగర్‌‌‌‌ పరిధిలోని పందికుంటపల్లి ప్రైమరీ స్కూల్‌‌‌‌ను సైతం ఆఫీసర్లు రీ ఓపెన్‌‌‌‌ చేశారు.