లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. హైదరాబాద్ , సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని 8 గంటల కంటే ముందు పార్టీల ఎజెంట్ల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ లు ఓపెన్ చేస్తామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నాంపల్లి, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలలో ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ ఉంటే జూబ్లీహిల్స్ లో మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.
ఫస్ట్ రిజల్ట్ చార్మినార్ వచ్చే అవకాశం ఉందని మధ్యాహ్నం మూడు గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. VVPATలు ఐదింటిని అబ్ జర్వర్ల ఆధ్వర్యంలో లెక్కింపు ఉంటుందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు 17 రౌండ్లు ఉంటాయని 12వందల మంది సిబ్బందిని కేవలం కౌంటింగ్ కు వాడుతున్నామని చెప్పారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ కు ECI నుంచి అబ్ జర్వర్లు ఉంటారని తెలిపారు రొనాల్డ్ రోస్