రామాలయ భూమి పూజను టీవీల్లో చూసిన 16 కోట్ల మంది

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణ భూమిపూజను టీవీ లైవ్‌లో సుమారు 16 కోట్ల మంది చూశారని ప్రసార భారతి సీఈఓ వెంపటి శశిశేఖర్‌‌ చెప్పారు. దీంతో ఇండియాలో 700 కోట్లనిమిషాల టీవీ వ్యూయర్‌‌షిప్‌ వచ్చిందని ప్రాథమికంగా అంచనా వేశారు. శశిశేఖర్‌ ‌మాట్లాడుతూ.. సుమారు 2వందల చానెల్స్‌లో దూరదర్శన్‌ లైవ్‌ ప్రసారమైందని చెప్పారు. బుధవారం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ప్రధాన కార్యక్రమాలను దూరదర్శన్‌ లైవ్‌ టెలికాస్ట్‌ చేసింది.

For More News..

అమ్మను సర్ప్రైజ్ చేద్దామనుకున్న కేరళ ప్రమాద విమాన పైలట్..

‘‘గందగి ముక్త్ భారత్’’ డ్రైవ్ స్టార్ట్ చేసిన మోడీ