16 మంది చనిపోతే..అమెరికాలో ఉండి ట్విట్టర్లో రాజకీయాలా?

విపత్తు సమయంలో కేసీఆర్..​ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని విమర్శించారు సీఎం రేవంత్. పదేండ్లు ముఖ్యమంత్రి అనుభవం ఇందుకేనా ...  కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆపద వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేయాలన్నారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండి..  ట్విట్టర్​ లో మంత్రులను చిల్లరగా విమర్శించడం సరికాదని చురకలంటించారు.  మంచి చేయాలనే ఉద్దేశం లేకపోతే ఫాంహౌస్ లో ​ పడుకోండి.. అంతేగానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్వార్థ రాజకీయాలు చేయవద్దన్నారు.  

ALSOREAD | తెలంగాణపై ప్రకృతి దాడి చేసింది : సీఎం రేవంత్​

 తెలంగాణలో భారీ వరదలకు  16 మంది చనిపోయారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.  వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమీక్ష జరిపిన ఆయన..లక్షలాది ఎకరాల్లోపంట నష్టం వాటిల్లిందని..వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని వెల్లడించారు.  తెలంగాణల వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది..తక్షణ సాయం కింద తెలంగాణకు 2 వేల కోట్లు రిలీజ్ చేయాలని కోరారు.