కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్ కు భారీగా తరలివస్తున్నారు.
ఈ వారంలో మొదటిసారి మంగళవారం(ఫిబ్రవరి 27) ప్రజావాణిలో ప్రజలు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. నోడల్ ఆఫీసర్ దివ్య ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది అప్లికేషన్స్ ను స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 50,500 ఫిర్యాదులు వచ్చాయని ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ప్రత్యేకంగా16 డిపార్ట్ మెంట్స్ కు సంబంధించిన కౌంటర్ లు ఏర్పాటు చేశామన్నారు. 100 మంది సిబ్బంది ప్రజావాణిలో పని చేస్తున్నారని.. వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నామని పేర్కొన్నారు. నిన్న(ఫిబ్రవరి 26) ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూ చేశారని చెప్పారు. తమ దగ్గరికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే దిశగా పని చేస్తున్నామని -ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య తెలిపారు.
ALSO READ :- త్వరగా కోలుకోవాలి.. షమీ సర్జరీపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
భూ కబ్జా, డబల్ బెడ్ రూం ఇళ్లు, గృహ హింస,తదితర సమస్యలకు సంబంధించి అధికంగా ఫిర్యాదులు వస్తుండటంతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.