
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి శివారులో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. వంతెనపై నుంచి వెళ్తూ ఆటో అదుపు తప్పింది. ఈ దుర్ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. కూలీలందలదీ హుజురాబాద్ మండలం సిరసపల్లి గ్రామం అని తెలిసింది. ఒక ఆటోలో 16 మందిని ఎక్కించి తరలించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.