భద్రాద్రికొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో16 మంది కూలీలు గాయపడ్డారు. ఉదయం వ్యవసాయ పనులకు ఆటోలో వెళ్లిన 16 మంది కూలీలు పని పూర్తి చేసుకుని సాయంత్రం అదే ఆటోలో ఇండ్లకు బయలుదేరారు. పరిమితికి మించి ప్రయాణికులు ఉండడంతో మైలారం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది.
దీంతో 16 మంది గాయపడ్డారు. వీరిని స్థానికులు కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. రెగ్యులర్ ప్యాసింజర్ఆటో అయినా వెనక టాప్ తీసేసి 16 మందిని ఇరికించి తీసుకువెళ్లారని తెలుస్తోంది. గాయపడ్డవారిని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా పరామర్శించారు.