గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ .. 16 మంది సభ్యులు ఎలిమినేట్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ లో ఎలిమినేట్ ప్రక్రియ కొనసాగుతుంది. 16 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 120 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 67 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డికి 22 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్ధి అశోశ్ కు 24 ఓట్లు పోలయ్యాయి.  ఐతే అభ్యర్థులెవ్వరికీ 50 శాతం ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.  రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 26 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. 27 వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.