వికారాబాద్ డిపోకు16 కొత్త బస్సులు

వికారాబాద్ డిపోకు16 కొత్త బస్సులు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​ఆర్టీసీ డిపోకు ప్రభుత్వం 16 కొత్త బస్సులను కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ విజ్ఞప్తి మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​గౌడ్​కొత్త బస్సులను అలాట్​చేశారు. 

మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని, అనుగుణంగా మరిన్ని బస్సులు కావాలని కోరగా ఈ మేరకు కేటాయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్​కు స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

షాద్​నగర్​డిపోకు 18 బస్సులు

షాద్​నగర్: తన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం షాద్​నగర్​డిపోకు 18 కొత్త బస్సులు కేటాయించిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. త్వరలోనే షాద్ నగర్ డిపోలో సిబ్బంది కొరత తీరుతుందన్నారు.