మునుగోడు ఉపఎన్నికలో భాగంగా ఇవాళ 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 17 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఈ నెల 14 వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. 15న నామినేషన్ల పరిశీలన, 17 వరకు నామినేషన్ల విత్ డ్రాకు ఈసీ గడువు ఇచ్చింది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా..6న ఫలితం తేలనుంది. మునుగోడు బరిలో పలు పార్టీలున్నా.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి.