ఆఫ్ఘనిస్తాన్ లోని ఐబక్ నగరంలో ఉన్న ఒక మదర్సాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, 24 మందికి గాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువమంది పిల్లలు, సామాన్య ప్రజలే ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి ఈ దాడి ఘటనను ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్యపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.
దాడికి బాధ్యులను గుర్తించే పనిలోనే ఉన్నామని ఆఫ్ఘనిస్తాన్ హోంశాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ నాఫయ్ టాకోర్ తెలిపారు. మృతుల సంఖ్యను తగ్గించిచూపే ప్రయత్నంలో భాగంగా.. కేవలం 10 మందే చనిపోయారని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యులమని ప్రకటించుకోలేదు.