కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి

కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి

యాదగిరిగుట్ట, వెలుగు: కుక్కల దాడిలో గొర్రెలు చనిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన దడిగె అయిలయ్య శనివారం రాత్రి గొర్రెల మందను తన వ్యవసాయ పొలం వద్ద దొడ్డిలో తోలి ఇంటికి వెళ్లాడు. 

ఆదివారం తెల్లవారుజామున  వెళ్లి చూడగా16 గొర్రెలు చనిపోయి కనిపించాయి. కుక్కల దాడిలో  చనిపోవడంతో వాటిని చూసి అయిలయ్య బోరున విలపించాడు. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం, గ్రామస్తులు కోరారు. గ్రామాల్లో, వ్యవసాయ బావుల వద్ద విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.