కుంభమేళాకు 16 స్పెషల్​ రైళ్లు

కుంభమేళాకు 16 స్పెషల్​ రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: జనవరిలో ప్రారంభం కానున్న మహా కుంభమేళా కోసం  16 స్పెషల్​ ట్రైన్స్​ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.  గుంటూరు, అజామ్​ఘర్, మౌలాలి, గయా, నాందేడ్, పాట్నా, కాచిగూడ మార్గాల్లో  జనవరి18 నుంచి ఫిబ్రవరి 23 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.  సంక్రాంతి, ఇతర పండగల సందర్భంగా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు స్పెషల్​ రైళ్ల సేవలను పొడిగించింది.

ఈ రైళ్లు సికింద్రాబాద్, రామనాథపురం, కాచిగూడ, మధురై, నాందేడ్, ఈరోడ్,  కాచిగూడ, నాగర్​ సోల్, తిరుపతి,అకోలా, లింగంపల్లి, కాకినాడ టౌన్​, హైదరాబాద్,  కటక్, రక్సెల్, నర్సాపూర్,​ ఎస్ఎంవీటీ, బెంగుళూరు మార్గాల్లో జనవరి 3 నుంచి ఏప్రిల్​ 2 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.