హైదరాబాద్,వెలుగు : ఈసారి గ్రేటర్‌ఎన్నికల్లో 16 మంది స్టూడెంట్లు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి కొందరు, ఇండిపెండెంట్లుగా మరికొందరు బరిలో నిలిచారు. గతంలో ఇంత మంది స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేదు. ఈఏడాది కరోనా, లాక్ డౌన్ వల్ల ఎన్నో నేర్చుకున్నామని, తాము కూడా ప్రజలకు మేలు చేసేందుకు పాలిటిక్స్‌లోకి వచ్చినట్లు యంగ్ క్యాండిడేట్స్చెబుతున్నారు. 21, 22 ఏండ్ల వారు సైతం నామినేషన్ వేశారు. స్టూడెంట్లే గాక, సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్, ప్రైవేటు టీచర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, నిరుద్యోగులు బరిలోకి దిగారు. పోటీ చేస్తున్న మొత్తం1,122 మంది క్యాండిడేట్లలో డిగ్రీ, పీజీ చదివిన వారి సంఖ్య 40 శాతం వరకు ఉంది. మిగతా వారంతా ఇంటర్, టెన్త్, అంతకంటే తక్కువ చదివిన వారు ఉన్నారు. ఈసారి నలుగురు డాక్టర్లు, పది మంది అడ్వకేట్లు, నలుగురు ప్రైవేటు టీచర్లతోపాటు జర్నలిస్టులు పోటీలో ఉన్నారు. మామూలుగా అయితే 25 ఏళ్లు దాటేంత వరకు రాజకీయాల గురించి పట్టించుకునే యూత్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం 21ఏళ్ల లోపు వాళ్లు కూడా నామినేషన్ వేశారు. అన్ని పార్టీల క్యాండిడేట్లలో చిన్న వయసులోనే పోటీ చేస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు.
గెలిచి సేవ చేయాలనుకుంటున్న..
డిగ్రీ ఫైనలియర్ కంప్లీట్ చేశా. ఈసారి ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయలనుకుంటున్నా. యూత్ సపోర్ట్ చేస్తే నాదే గెలుపు. డివిజన్ డెవలప్మెంట్కు కృషి చేస్తా.
– ఆసిఫియా ఖాన్, గోల్కొండ డివిజన్ టీఆర్ఎస్ క్యాండిడేట్
యూత్ సపోర్ట్‌తో గెలుస్త..
పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా గుడిమల్కాపూర్‌లో పెద్దగా డెవలప్మెంట్ చేయలేదు. కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగినా ఇవ్వలేదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా. యూత్సపోర్ట్ గా ఉంటే గెలిచి డివిజన్అభివృద్ధి చేస్తా. అబిడ్స్‌లోని మెథడిస్ట్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ఇయర్చదువుతున్నా.
– ఎం.కార్తీక్‌యాదవ్ ,గుడిమల్కాపూర్ డివిజన్ ఇండిపెండెంట్క్యాండిడేట్
ఇంట్రెస్ట్తోనే పోటీ చేస్తున్న..
ఈ ఏడాదే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశా. పాలిటిక్స్అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్న వయసులోనే కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నా. గెలిపిస్తే డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.. – పి.వైష్ణవి, సనత్‌నగర్ డివిజన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్
ప్రజాసేవ కోసం ఉండిపోయా..
బీటెక్ కంప్లీట్చేశా. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికావెళ్దామనుకున్నా. కానీ కరోనా, లాక్ డౌన్ లతో కుదరలేదు. ప్రజాసేవ చేసేందుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా.- టీవీ తపస్విని, గౌతం నగర్ డివిజన్ కాంగ్రెస్ క్యాండిడేట్