న్యూఢిల్లీ : ఫ్యూయల్ పంప్ మోటార్‌లో సమస్యలు ఉండడంతో 16 వేల బాలెనో, వేగన్‌ఆర్ కార్లను మారుతి సుజుకీ రీకాల్ చేసుకుంటోంది. జులై 30, 2019 నుంచి నవంబర్ 1, 2019 మధ్య తయారైన 11,851 బాలెనో, 4,190 వేగన్ ఆర్ కార్లను రీకాల్ చేసుకుంటున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కార్లలోని ఫ్యూయల్ పంప్ దగ్గర సమస్య ఉండొచ్చని, ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బంది ఉంటుందని వెల్లడించింది.
లేదా బండి సడెన్‌గా ఆగిపోయే సమస్య తలెత్తొచ్చని తెలిపింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న కస్టమర్లు మారుతి సుజుకీ అథరైజ్డ్ డీలర్లను సంప్రదించాలి. సమస్య ఉన్న పార్టులను ఫ్రీగా మారుస్తారు. మారుతి సుజుకీ కిందటి నెలలో 1,97,471 కార్లను అమ్మింది. కిందటేడాది ఫిబ్రవరిలో అమ్మిన 1,72,321 కార్లతో పోలిస్తే 15 శాతం గ్రోత్ నమోదు చేసింది. డొమెస్టిక్ మార్కెట్‌లో 1,60,271 బండ్లను సేల్ చేసింది.