సీసీ కెమెరాలకు అడ్డుగా ఉన్నాయని.. 16 చెట్ల నరికివేత

ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న  చిల్డ్రెన్స్ పార్క్  ఎదుట  రెండేళ్ల క్రితం పోలీస్ అధికారులు, సిబ్బంది హరితహారంలో భాగంగా నాటిన   16 చెట్లను జీహెచ్ఎంసీ సిబ్బంది నరికివేశారు. హరితహారం మొక్కలను  మేకలు మేసినా.. మేకల యజమానులకు అధికారులు ఫైన్లు వేశారు.

కానీ ఇక్కడ మాత్రం జీహెచ్​ఎంసీ సిబ్బందే వాటిని కట్​ చేశారు.  అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని,  ఇదే ప్లేస్ లో మద్యం మత్తులో ఓ మహిళను ఓ వ్యక్తి హత్య చేశారని, సీసీ  కెమెరాలకు అడ్డుగా ఉన్నాయని ఈ చెట్లను నరికినట్లు తెలుస్తోంది.