సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 వీక్లీ స్పెషల్ రైలు సర్వీసులను పొడిగించారు. ఈనెల 29 నుంచి సెప్టెంబరు 30వరకు దాదాపు రెండు నెలల వరకు సర్వీసులను పొడిగించారు. గోరక్‌పూర్– మహబూబ్‌నగర్, -గోరక్‌పూర్–విశాఖపట్నం–సికింద్రాబాద్, మహబూబ్‌నగర్–విశాఖపట్నం, సాంబ్లాపూర్–ఇరోడా, హైదరాబాద్–తిరుపతి, విశాఖ పట్నం–తిరుపతి, భువనేశ్వర్– తిరుపతి, విశాఖపట్నం–బెంగళూరు, ఇరోడా–సాంబ్లాపూర్ రైళ్లను పొడిగించారు.