బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్.. ప్రపంచంలోనే ఫస్ట్ కేసు

న్యూఢిల్లీ : యూకేలో16 ఏండ్ల బాలికపై వర్చువల్​గ్యాంగ్​రేప్ ​జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇంది కొంత విచిత్రంగా అనిపిస్తున్నా.. ఇలాంటి వర్చువల్ గ్యాంగ్​రేప్​పై పోలీసులు దర్యాప్తు చేపట్టడం ఇదే తొలిసారి. యూకేలోని ఓ బాలిక(16) వర్చువల్​ రియాలిటీ గేమ్స్​ఎక్కువగా ఆడుతుంటుంది. గేమ్​లో ఆమె డిజిటల్​ క్యారెక్టర్​పై గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గేమ్​లో ఉండగానే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. టీనేజ్ బాలిక ఆన్‌‌‌‌లైన్ గేమ్‌‌‌‌లో లీనమై ఉండగా.. కొంతమంది పురుషులు ఆమె క్యారెక్టర్‌‌‌‌పై ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో గ్యాంగ్ రేప్‌‌‌‌కు పాల్పడ్డారని న్యూయార్క్​ టైమ్స్ ​పేర్కొంది.

అయితే వాస్తవంగా బాలికపై భౌతికంగా అత్యాచారం జరగకున్నా.. తనపై అత్యాచారం జరిగినట్లు మానసిక బాధను అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ బాధ ఎక్కువ కాలం ఆమెపై ప్రభావం చూపించే అవకాశం ఉందని యూకే పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలాంటి కేసులపై ప్రత్యేకంగా చట్టాలు ఏమీ లేవని, దీంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. వర్చువల్ నేరాలపై ఇన్వెస్టిగేషన్​ కొనసాగించాలా? వద్దా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ఈ కేసుపై యూకే హోం సెక్రటరీ జెమ్స్ క్లివర్లీ మాట్లాడుతూ.. ఈ ఘటనలో బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్లిందని చెప్పారు. అయితే హారిజోన్ వరల్డ్‌‌‌‌లో వర్చువల్ సెక్స్ నేరాలపై అనేక నివేదికలు వచ్చాయి. ఇది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే, తమ ప్లాట్‌‌‌‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానంలేదని, తమ వినియోగదారులకు ఆటోమెటిక్ రక్షణ ఉంటుందని, అపరిచితులనుదూరంగా ఉంచుతుందని మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు.