హైదరాబాద్, వెలుగు: సివిల్సప్లయ్స్కార్పొరేషన్ లో160 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్ ప్రత్యేక చొరవతో 33 జిల్లాలకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఇచ్చారు. వీటితో ఏర్పడిన ఖాళీలను ప్రత్యేక రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సివిల్సప్లయ్స్ఉద్యోగులు కమిషనర్‌ను సత్కరించారు. ఆ తర్వాత కమిషనర్ మాట్లాడుతూ.. సంస్థ పనితీరును మెరుగుపర్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.