కామారెడ్డిలో 162 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

కామారెడ్డిలో 162 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

కామారెడ్డిటౌన్, వెలుగు :  కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి దేవునిపల్లిలోని సాయి శ్రీనివాస్ రైస్‌‌‌‌మిల్లులో నిలిపిన డీసీఎంలో 162 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్​ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌, సివిల్​సప్లయ్​ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

డీసీఎంతోపాటు లవుడియా అరవింద్, సురేశ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. సివిల్​ సప్లయ్​ డీటీ కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌‌‌ఐ చెప్పారు.