తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 15,445 శాంపిల్స్ పరీక్షించగా.. 1640 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే 8 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 52,466కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 455కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 1007 మంది కరోనా నుంచి కోలుకున్నారని, దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 40,334కి చేరిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం 11,677 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా రికవరీ రేటు 76.8 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 0.86 శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా పేషెంట్ల కోసం రాష్ట్రంలో 15,216 బెడ్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 15,445 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 3,22,326 కరోనా టెస్టులు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 15.5 శాతంగా ఉందని వెల్లడించింది.
తెలంగాణలో మరో 1640 కరోనా కేసులు
- తెలంగాణం
- July 25, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Mahesh Babu: ధనుష్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎందుకంటే?
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. చిల్డ్రన్స్ డే రోజే ఘటన
- లెక్కలు తీస్తే వాళ్ళ బొక్కలు ఇరుగుతవి : టీపీసీసి ప్రెసిడెంట్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : పిల్లలతో ఇలా గడపండి.. సంతోషం మీ వెంటే.. రోజుకు కనీసం ఓ గంట..!
- పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తూ.. 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Most Read News
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఆందోళన
- నిజాంపేట్-JNTU రూట్లో వెళుతున్నారా..? అయితే అర్జెంట్‌గా మీకీ విషయం తెలియాలి..!
- ICC ODI rankings: ఆస్ట్రేలియాపై విధ్వంసం.. వరల్డ్ నెం.1 బౌలర్‌గా పాకిస్థాన్ పేసర్
- Bigg Boss: హౌస్‌లో ఇది గమనించారా.. ఎలిమినేట్ అయ్యేది అంతా తెలుగు వాళ్లే.. ఈ వారం కూడా!
- Secunderabad: హమ్మయ్య.. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సేఫ్‌గా వెళ్లి ట్రైన్ ఎక్కొచ్చు..!
- మాస్ గుర్రంపై బాలకృష్ణ.... NBK109 టైటిల్ ఇదేనా..?
- Kavya Thapar: అతను కమిట్మెంట్ ఇవ్వాలన్నాడు.. కావ్య థాపర్ రియాక్షన్ ఇదే!
- Ramana Gogula: 18 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం