డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వేలానికి 165 మంది

డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వేలానికి 165 మంది

ముంబై : విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌) రెండో ఎడిషన్ ప్లేయర్ల వేలంలో 165 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. ఈ నెల 9న ముంబైలో జరిగే వేలంలో 104 మంది ఇండియన్స్‌‌‌‌‌‌‌‌, 61 మంది విదేశీ క్రికెటర్లు బరిలో నిలిచారు. ఫారిన్ ప్లేయర్లలో  15 మంది అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు. మొత్తంగా క్యాప్డ్ ప్లేయర్లు 56 మంది ఉండగా, అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్ ప్లేయర్స్ 109 మంది ఉన్నారని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

ఐదు జట్లలో కలిపి మొత్తంగా 30 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో 9 స్థానాలు ఫారిన్ క్రికెటర్లవి. వెస్టిండీస్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ దియాండ్ర డాటిన్‌‌‌‌‌‌‌‌,  ఆస్ట్రేలియా పేసర్ కిమ్ గార్త్ అత్యధికంగా రూ. 50 లక్షల  బేస్ ప్రైజ్‌‌‌‌‌‌‌‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఆసీస్ ఆల్ రౌండర్లు అనాబెల్ సదర్లాండ్, జార్జియా వారెహామ్, ఇంగ్లండ్​  కీపర్ అమీ జోన్స్, సౌతాఫ్రికా వెటరన్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్  రూ. 40 లక్షల బేస్ ప్రైజ్‌‌‌‌‌‌‌‌తో వేలానికి రానున్నారు.

-- ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు 21 మంది ఫారినర్స్ సహా మొత్తం 60 మంది క్రికెటర్లను రిటైన్ చేసుకున్నాయి. జెయింట్స్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 10 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.