లీప్ డే రోజు 1650 మంది పుట్టిండ్రు

లీప్ డే రోజు 1650 మంది పుట్టిండ్రు

హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి 29 స్పెషల్‌‌ డే. నాలుగేండ్లకోసారి వచ్చే రోజిది. ఇయ్యాల ఏ వేడుక జరిగినా మళ్లీ జరుపుకోనింకె నాలుగేండ్లు ఆగాల్సిందే. ఇట్లాంటి రోజున రాష్ట్రంలో సుమారు 1,650 మంది పిల్లలు పుట్టారు. సంగారెడ్డి జిల్లా హాస్పిటల్‌‌లో 14, నిలోఫర్‌‌లో 11, బాన్సువాడలో 6 డెలివరీలు జరిగాయి. సంగారెడ్డిలో ఓ మహిళలకు కవలలు పుట్టారు. లీప్‌‌ డే రోజు పిల్లలు పుట్టడంతో ‘మావోడి ఫస్ట్‌‌ పుట్టినరోజు నాలుగేండ్లకోసారి వస్తది’ అని తోటి వాళ్లతో తల్లిదండ్రులు, బంధువులు చెప్పుకొని సంబురపడ్డారు. రావాల్సిన రోజు రాకరాక రావడంతో శనివారం చాలా మంది తమ బర్త్‌‌డేలు, మ్యారేజ్‌‌ డేలను జబర్దస్త్‌‌గ చేసుకున్నరు. మళ్లో నాలుగేండ్లు గుర్తుండేలా ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నరు.

For More News..

చైర్మన్ల ఎన్నికల్లో పెద్ద లీడర్లకూ ఝలక్

రామయ్య కల్యాణానికి కాసుల కష్టం