
చదలవాడ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 167 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టరన్న ఆరోపణలపై సోదాలు చేశారు. గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. హైదరాబాద్ తో పాటు ఒంగోలులోనూ సోదాలు చేశారు. చదలవాడ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ డైరెక్టర్ చదలవాడ రవీంద్రబాబుతో పాటు మరికొంతమందిపై CBI,ACB కేసు నమోదు అయ్యింది.
బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఉద్యోగులు, డైరెక్టర్ల ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. రుణం ద్వారా పొందిన నిధులను దుర్వినియోగం చేశారని ఈడీ తెలిపింది. ఉద్యోగులు, డైరెక్టర్ల ఖాతాల్లోకి రుణ మొత్తాలను మళ్లించినట్లు గుర్తించామన్నారు. దారి మళ్లించిన నిధులతో థర్డ్ పార్టీలు, డైరెక్టర్లు, కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు సంపాదించారని చెప్పారు.
సోదాల్లో భాగంగా ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్‌ల రికవరీ చేసి సీజ్ చేశామని తెలిపారు. నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. నిధులు మల్లింపులో తదుపరి విచారణ కొనసాగుతుందని ఈడీ తెలిపింది.