సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో 169 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం : రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
ఎంపిక: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15 వరకు అప్లై చేసుకోవాలి. వివరాలకు www.recruitment.crpf.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.